ఇక ఇన్చార్జిలు ఉండరు
బాన్సువాడ నియోజకవర్గం ప్రదాత శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇకనుండి అన్ని తానై నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలబడతారని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పెత్తనం చలాయించారని నేటి నుండి ఎవరి పెత్తనం బాన్సువాడలో కొనసాగదని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు హెచ్చరించారు.
మాజీ శాసన సభాపతి,మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బాన్సువాడ పట్టణంలోని ఎస్ ఎం బి ఫంక్షన్ హాల్ లో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభ మరియు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఆగ్రోస్ నూతన చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు కి
అభినందన సభ
ముందుగా కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం వద్ద నుండి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి వరకుకాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆద్వర్యంలో భారీ బైక్ మరియు కార్ ర్యాలీ.
పాల్గొన్న కాసుల బాలరాజు , మాజీ డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి , మాజీ శాసనసభ్యులు కత్తెర గంగాధర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
సభా వేదికపై కాసుల బాలరాజు ని మెమొంటో, శాలువాతో సత్కరించిన పోచారం.
ఈసందర్భంగా బిఆర్ యస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రజాప్రతినిధులు, నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పోచారం భాస్కర్ రెడ్డి.ఈసందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తమ్ముడు కాసుల బాలరాజు కి హృదయపూర్వక శుభాకాంక్షలు.
వ్యవసాయ రంగంలో రాష్ట్ర స్థాయిలో కీలకమైన సంస్థకు బాధ్యతలు స్వీకరించారు.
నాది 47 సంవత్సరాల రాజకీయ జీవితం.
మొదట కాంగ్రెస్ పార్టీలో తరువాత తెలుగుదేశం, బిఆర్ యస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసాను.
రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు మారడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరా కాంగ్రెస్ తరుపున పనిచేశాను. ఇందిరాగాంధీ ని బాన్సువాడ కు తీసుకువచ్చి సభను ఏర్పాటు చేయించాం.నేను యువకునిగా ఉన్నప్పుడు సభలను ఎలా ఏర్పాటు చేయించానో ఇప్పుడు అదేవిధంగా నా కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి సభలు, సమావేశాలను ఏర్పాటు చేయిస్తూ అన్ని చూసుకుంటున్నారు.
1977 నుండి 1984 వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. యన్ టి రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి 27 సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేశాను.
తరువాత తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ యస్ పార్టీలో చేరాను.
ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నా రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో తిరిగి ముగింపు అ క్కడికే రావడం జరిగింది.
బాన్సువాడ మంచి నియోజకవర్గం. నేను ఏ పార్టీలో ఉన్న ఇతర పార్టీల వారు నన్ను పల్లెత్తు మాట అనలేదు.
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం.
రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.అద్దెకు వచ్చిన వాళ్ళు కుటిల బుద్దితో నా రాకను వ్యతిరేకించారు. తప్ప అసలైన బాన్సువాడ నియోజకవర్గ స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను మనఃస్పూర్తిగా ఆహ్వానించారు.నేను వస్తే నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉంటారని ఆనందించారు.నా నిర్ణయాన్ని గౌరవించి బీ ఆర్ఎస్ పార్టీలో నాతో పాటు పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.
నన్ను పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా నిర్ణయాన్ని గౌరవించి నాతో పాటుగా బి ఆర్ ఎస్ పార్టీ నుండి నడిచి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు.ఇక ఇప్పుడు పాత లేదు, కొత్త లేదు అందరం కలిసిపోయాం, ఇది అరుదైన సంఘటన. బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రమే ఇలాంటి మంచి వాతావరణం ఉన్నది.
అందరం కలిసి ఒకే వేదికను పంచుకుంటున్నాం ఇది మంచి పరిణామం.పాత కొత్త సమ్మేళనంతో మంచి ఫలితాలు సాదిద్దాం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. మీ మనస్సు నొప్పించే పని ఏది జరగదు, జరుగనివ్వను.
అందరం కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు.
ఇన్నాళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మిమ్మల్ని ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తాను. మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నా.మీతో కలిసి పనిచేయడానికి వచ్చాను తప్ప మీ మీద పెత్తనం చేయడానికి కాదు.
మీ అందరి సహకారం కావాలి. అందరం కలిసి బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. ప్రతిపక్షాలకు డిపాజిట్ రాకుండా చేద్దాం.
నేను, బాలరాజు , భాస్కర్ రెడ్డి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయి. సుపరిపాలన ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.చిన్న వయస్సు అయినా దైర్యంగా పనిచేస్తున్నారు. కొన్ని హామీలను అమలు చేయడానికి సమయం పడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రుణమాఫీ పూర్తి చేస్తారు. అప్పుడు విమర్శలు చేస్తున్న వారందరి నోర్లు మూతపడుతాయి.ముఖ్యమంత్రి సారధ్యంలో రాష్ట్రం బాగుపడుతుంది.
కాసుల బాలరాజు మాట్లాడుతూ కొంతమంది బయటి వ్యక్తులు దోచుకోవడానికి బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చారు. వాళ్ళు ఏనాడు కార్యకర్తలకు అన్నం పెట్టలేదు.
వాళ్ళ స్వలాభం కోసమే ఇక్కడికి వచ్చారు తప్ప సేవ చేయడానికి కాదు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏమి చేయని వ్యక్తి ఇక్కడకు వచ్చి ఏం చేస్తాడు. వాళ్ళు తరిమితే ఇక్కడకు వచ్చిండు.
ఇక్కడ ఆయన దుకాణాలు నడువవు. స్థానిక నాయకులే ఫైనల్.
నేను ముఖాముఖి పోరాడే వ్యక్తిని
నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి పోచారం శీనన్న కాంగ్రెస్ పార్టీ లోకి వస్తుంటే స్వాగతించాను.
బాన్సువాడ నియోజకవర్గంలో కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి శీనన్న వచ్చారు.ఇకనుంచి నియోజకవర్గ ఇంచార్జి అనేది ఉండదు, ఎమ్మెల్యే నే అన్ని, అందరం కలిసి పనిచేస్తాం.అర్హులైన వారందరికీ పదవులు దక్కుతాయి. కష్టపడి పనిచేసిన వారికి న్యాయం జరుగుతుంది.
ఆగ్రోస్ చైర్మన్ గా నిజాయితీగా పనిచేస్తూ రైతులకు సేవలను అందిస్తాను.
పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాసుల బాలరాజు గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం ఆయనకు రాష్ట్ర స్థాయి పదవిని ఇచ్చి గౌరవించింది.
బాలరాజు ని ఆగ్రోస్ చైర్మన్ గా నియమించినందుకు రాహుల్ గాంధీ కి, మల్లిఖార్జున ఖర్గే కి, రేవంత్ రెడ్డి కి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరుపున కృతజ్ఞతలు.
పోచారం శ్రీనివాసరెడ్డి వ్యక్తి కాదు ఒక మహత్తర శక్తి.
అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడు మన పోచారం శ్రీనివాసరెడ్డి.
1977 లో కాంగ్రెస్ కండువా కప్పుకొని యువకునిగా కాంగ్రెస్ కుటుంబంలోకి ప్రవేశించారు.
అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేశారు. అలా చూస్తే అందరికంటే ఎక్కువ సీనియర్ పోచారం మే.రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పోచారం పార్టీలు మారడం జరిగింది.తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా టిఆర్ యస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన తరువాతనే ఉద్యమం ఉదృతం అయింది.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలు సేవ చేశారు. పదివేల కోట్ల రూపాయలతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.బాన్సువాడ నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు ముందుకు సాగాలన్నా, అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్న వారిని తొలగించాలనే ఉద్యేశంతో పోచారం కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది.
పోచారం పార్టీ మారాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించారు.మంచి నిర్ణయం తీసుకున్నారు అని అభినందిస్తున్నారు.
బలమైన నాయకుడు పోచారం పార్టీలోకి రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పోచారం కి లక్ష్మీ పుత్రుడు అని పేరు పెట్టాడు. లక్ష్మీ అనేది లేదు పుత్ర స్థానమే ఇచ్చారు. లక్ష్మీ మొత్తం వాళ్ళ కుటుంబం దగ్గరే ఉన్నది.పోచారం కి డబ్బు సంపాదన మీద ఆలోచన,వ్యామోహం లేదు.బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధే పోచారం సంకల్పం, ఆశయం. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటినుంచి మా కార్యకర్తలను ఎలా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామో అదేవిధంగా ఇప్పటి నుండి పాత కొత్త లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను అందరిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇస్తున్నా.రాజకీయంగా కేసులు పెట్టిస్తాడు అని కొంతమంది నాపై అధిష్టానానికి పిర్యాదు చేసారు. నాకు తెలవకుండా స్థానిక నాయకులు ఏవైనా అలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చు. కానీ నేను ఏనాడు రాజకీయ కక్ష్యలకు పాల్పడలేదు. అనవసరంగా నాపై నిందలు మోపుతున్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెసు పార్టీ జెండా మోస్తున్న కాసుల బాలరాజు కి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే ఈ మద్య కండువా కప్పుకున్న బయటి నియోజకవర్గం నాయకుడు అడ్డం పడడానికి ప్రయత్నించాడు.మొన్నటి వరకు మా వెనుక ఉన్న దొంగలే ఇప్పుడు రాష్ట్ర మంత్రుల వద్దకు వెళ్ళి బాలరాజుకు పదవి రాకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు.పక్క నియోజకవర్గం నుండి ఇక్కడకు వచ్చిన నాయకుడు ఆరు నెలలోనే బాన్సువాడ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశాడు.బాన్సువాడ నియోజకవర్గాన్ని కాపాడే లక్ష్యాన్ని మనమందరం తీసుకోవాలి. అందరం సర్దుకుని ముందుకు పోదాం. మనందరం సంకల్పం ఒక్కటే బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో వందశాతం విజయం సాదించాలి.
