ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్న పోలీసులు. ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. రైల్వే ఎస్సై సాయి రెడ్డి.నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామ పరిధిలో మిట్టపల్లి రైల్వే గేటు క్రీడా ప్రాంగణం సమీపంలో గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. మృతులు పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన బండారి శైలజ, బండారి అనిల్ కుమార్ అనే 25 ఏళ్ళ వయస్సు గల వారిగా గుర్తింపు. వివాహం జరిగి ఏడాదిన్నర అయినట్టు సమాచారం.పని నిమిత్తం సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి నిజామాబాద్ వైపు వచ్చినట్టు సమాచారం.రాత్రి మిట్టపల్లి రైల్వే గేట్ సమీపంలో ఇద్దరి మృతదేహాలు గుర్తించిన స్థానికులు సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై సాయి రెడ్డి మరియు సిబ్బంది అయితే ఆత్మహత్యకు కుటుంబ కలహాల మరే ఇతర కారణాల అనే దానిపై ఆరా తీస్తున్న పోలీసులు ఆత్మహత్య చేసుకోవద్దని అవగాహన కల్పిస్తున్న యువత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.రైల్వే ఎస్సై సాయి రెడ్డి అన్నారు.
