Monday, February 16, 2026

అన్న ఎన్టీఆర్ నిర్మాతగా 43 చిత్రాలు

ద్రోణ హైదరాబాద్

అందులో 40 తెలుగు చిత్రాలు కాగా, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘చండశాసనుడు’ రీమేక్ లతో తమిళంలో రెండు చిత్రాలు, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌తో హిందీలో ఒకటి ఉన్నాయి. సాంఘికం, పౌరాణికం, చారిత్రక, జానపద వర్గాలు నాలుగింటిలోనూ చిత్రాలు తీసి, ఘనవిజయాలు సాధించారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ తన అభిరుచులకు సరిపడా సాహితీ, సాంకేతిక ఉద్దండులను ఆస్థాన విద్వాంసులుగా ఏర్పాటుచేసుకున్నారు. టి.వి రాజు, ఘంటశాల మాస్టారు, సముద్రాల సీనియర్‌, జూనియర్‌, సినారె, డి.వి.నరసరాజు, యోగానంద్‌, వంటి వారంతా ఎన్టీఆర్ నిలయ విద్వాంసులే.
ముఖ్యంగా ఎన్టీఆర్ తన సినిమాల్లో పాటలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఘంటసాల పాడగలిగినంత కాలం ఆయనతోనే పాడించుకున్నారు. మధ్యలో ఏ ఎం రాజా, మహమ్మద్ రఫీ, పీబీ శ్రీనివాస్ వంటి వారు ఎన్టీఆర్ కు పాడిన చిత్రాలు కూడా విజయవంతమై, ఆ పాటలు జనాదరణ పొందాయి. అయినప్పటికీ ఘంటసాలను వదల్లేదు ఎన్టీఆర్.
అప్పుడప్పుడూ మంచి పాటల కోసం తన సొంత చిత్రాల్లో కొన్ని ప్రయోగాలు చేసేవారు ఎన్టీఆర్. సంగీత దర్శకుల్లో జోసెఫ్‌ – కృష్ణమూర్తి (గులేబకావళి కథ), సుప్రసిద్ధ హిందీ సంగీత దర్శకులు సి. రామచంద్ర (అక్బర్‌ – సలీం – అనార్కలి), రవీంద్ర జైన్‌ (బ్రహ్మర్షి విశ్వామిత్ర) వంటి వారితో కూడా తన చిత్రాలకు పనిచేయించారు. ఈ చిత్రాల్లోని పాటలు ఎంతటి హిట్లో చెప్పక్కరలేదు.
తన సొంత చిత్రం కోసం పాటలను రికార్డు చేస్తూ సోదరుడు త్రివిక్రమరావుతో ఎన్టీఆర్ తీయించుకున్న ఫోటో ఇది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular