పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ద్రోణ పాలకుర్తి
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి స్థితిగతులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని స్పష్టం చేశారు.తొర్రూర్ పట్టణంలోని లైన్స్ క్లబ్ భవనం లో మదర్ తెరిసా మండల సమాఖ్య 15వ వార్షిక మహాసభ మండల సమాఖ్య అధ్యక్షురాలు అనూష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని ఝాన్సి రెడ్డి పాల్గొన్నారు. మహిళలందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరినీ కోటేశ్వరులను చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మహిళ శక్తి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమం ద్వారా వివిధ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోని మహిళలందరినీ కోటీశ్వరులను చేయడానికి సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. నియోజకవర్గంలోని మహిళలందరినీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వారు ఎల్లవేళలా తమను సంప్రదించవచ్చని అన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా తొరూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘ సభ్యులకు 20 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సబ్ సిబ్బంది బ్యాంక్ అధికారులు, వివిధ గ్రామాల మహిళా సంఘ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
