Monday, May 18, 2026

నిజామాబాద్ లో యువకుని దారుణ హత్య?

ద్రోణ నిజామాబాద్ :జూలై 17

నిజామాబాద్ జిల్లా కేంద్రం లో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. బుధవారం తెల్లవారు జామున వినాయక్ నగర్ ప్రాంతంలోని టీ స్టాల్ వద్ద రక్తపు మడుగులో యువ కుడు మృతదేహాన్ని చూసి న స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందజేయడంతో హుటా హుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంగళవారం రాత్రే యువ కుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు.ఈ సందర్భంగా జిల్లా ఏసీపి సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గురైన యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్ బృందాన్ని పిలిపించారు. హత్య కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular