Tuesday, February 17, 2026

మార్కెట్లో నాణ్యత కు బ్రాండ్ విజయ ఆయిల్ ను నిలపాలి

ద్రోణ హైదరాబాద్

తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ పనులను వేగవంతం చేయాలని,ఆయిల్, ప్యాకింగ్ సెక్షన్ నాణ్యత పెంచాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా అరంఘడ్ లోని విజయ ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ ను ఆయిల్ ఫెడ్ అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పరిశీలించారు.
మార్కెట్లోనాణ్యతకు మారుపేరుగా సన్ ప్లవర్, ఫాం ఆయిల్ ను విజయ ఆయిల్ ను బ్రాండెడ్ గా వుండేలా చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆకాంక్షించారు.
అవసరమైన అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులను కూడా కార్పోరేషన్ తరఫుకు అందిస్తామన్నారు.ధర తక్కువ అని కల్తీ నూనేలు కోని ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రతి ఒంటింట్లో ఆరోగ్య లక్ష్మీ అయిన విజయ నూనె ను వుండేలా కార్పోరేషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్‌ బదులు ఇక్కడే రైతులను ప్రొత్సహించి ఆయిల్ ఫాం,నూనె గింజల సాగుకు ప్రభుత్వాలు ప్రాధాన్యత పెట్టుకున్నందున ప్రతి విభాగం మేరుగైన సేవాలు. నాణ్యత పాటించినపుడే అంతర్జాతీయ మార్కెట్ పోటిలో నిలబడగలమన్నారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్‌పై కేంద్రం సెస్ విధిస్తే మన రైతుల ఆయిల్ పామ్‌కు ధర పెరిగి లాభం చేకూరుతుందన్నారు. ఈ దిశగా కేంద్రం పై ఇక్కడి బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular