Tuesday, February 17, 2026

5 కోట్లు స్వాహా చేసిన యూనియన్‌ బ్యాంకు మేనేజరు

ద్రోణ నిజామాబాద్

లోన్ ఇప్పిస్తామని నమ్మిం చాడు. ఆ బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి లోన్‌ కోసం అప్లై చేశారు. అయితే.. లోనైతే మంజూరైంది.కానీ లబ్దిదారుల ఖాతాల్లో మాత్రం ఆ లోన్ నిధులు జమ కాలేదు. నిజామాబాద్‌లో యూనియ న్‌ బ్యాంకు మేనేజర్‌ ఘరా నా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. 40 మందికి చెందిన రుణాల సొమ్ము 5 కోట్లు కాజేశాడు బ్యాంక్ మేనేజర్‌ అజయ్. లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి 8 నెలల క్రితం టర్మ్‌ లోన్‌తో పాటు సీసీ లోన్‌లు మంజూరయ్యాయి. అయితే.. లోన్ మంజూరైన వెంటనే ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. బ్యాంక్ మేనేజర్.బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి మోసపోయిన బాధితులు పోలీస్‌‌ స్టేషన్‌లో కంప్లైట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. రుణాల మంజూరులో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు.
5 కోట్ల రూపాయలతో ఉడాయించిన యూనియన్‌ బ్యాంక్ మేనేజర్ అజయ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular