Tuesday, February 17, 2026

విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తాం

టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

ద్రోణ హైదరాబాద్

సుప్రీం కోర్టు తీర్పు పై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండు.
టెక్నీకల్ పాయింట్స్ పై నే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నది.పింకీ తమ్ముళ్లు సంబరపడకండి జడ్జిమెంట్ ను తెలుసుకోండి.తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా.
తప్పు చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం.పది ఏండ్లలో 80 వేల కోట్ల అవినీతి చేశారు.
గతంలోనే విద్యుత్ కొనుగోలు లో అవినీతి జరిగిందని నేను చెప్పిన,బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే విద్యుత్ ఒప్పందాల పేరిట 133 కోట్లు కమిషన్ కేటీఆర్, హరీష్ రావులు తీసుకున్నారని గోవాలో జరిగిన ఒక సమావేశంలో వ్యాపారవేత్తలు వాపోయిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని జగదీశ్వర్ రెడ్డి , హరీష్ రావు సవాలు విసిరి కాలు దువ్వింది నిజం కాదా,ఇప్పుడు విచారణ చేపడుతుంటే.. కోర్టులను ఆశ్రయించి అడ్డుకట్ట వెయ్యాలన్న విషయంతోనే మీ దుర్నీతి బయటపడుతుంది.

తెలంగాణ రాకముందు మీ ఆస్తుల ఎంత..?

వచ్చాక ఆస్తులు ఎంత..?

అన్ని బయటకు వచ్చి జైలుకు పోతారు.

అభివృద్ధి పేరు పైన , ప్రాజెక్టుల రీ డిజైన్ పేరు మీద వేలాది కోట్లు దోచుకున్నారు.విచారణ ను అడ్డుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు.కెసిఆర్ అవినీతి చేయలేదని సుప్రీం కోర్టు ఏమీ చెప్పలేదు.
కొత్త జడ్జి వచ్చి అవినీతిని బయటకు తీస్తాడు.
కేసీఆర్,కేటీఆర్ ,హరీష్ రావు లు అవినీతికి పాల్పడలేదని ఎక్కడ చెప్పలేదు.
కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణ ను ఆపమని చెప్తున్నాడు.
తెలంగాణ బిడ్డల నుంచి మీరు చేసిన దోపిడీ కక్కించాల్సిన బాధ్యత మా రేవంత్ సర్కార్ మీద ఉంది .మేమెక్కడా కూడా కక్షపూరితంగా వ్యవహరించడం లేదు.చట్టబద్ధంగానే విచారణ చేపట్టి కెసిఆర్ ను జైల్లో పెడతాం.మీ అక్రమ ఆస్తులు ఎంతనో మీకు సహకరించిన అధికారుల ఆస్తులు ఎంతనో లెక్కతీస్తాం.
గ్రీన్ ఛాలెంజ్ అని హడావిడి చేసే చెట్ల సంతోష్ పత్తా లేకుండా పోయిండు.
వాళ్ళ ఆవిడా పేరుమీద నర్సరీ పెట్టి కోట్ల రూపాలను దోచుకున్నారు.
దానిపై కూడా విచారణ చేపట్టాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular