బాన్సువాడ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ సంబురాల ఏర్పాట్లపై తన నివాసంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులువ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో సన్నాహక సమావేశం నిర్వహించిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. పాల్గొన్న రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు , మాజీ నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , ఏ డి ఏ అనీల్ కుమార్ . ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ రాష్ట్ర రైతులను రుణ విముక్తి చేయడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.రైతులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు ఉన్న రైతులకు రేపు రుణమాఫీ మొత్తం బ్యాంకులో జమ చేస్తారు. ఆగస్టు నెల లోపల రెండు లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ అమలు చేస్తారు.లక్ష రూపాయల లోపు ఉన్న రాష్ట్రంలోని మొత్తం 11.50 లక్షల మంది రైతులకు రేపు రూ. 6,800 కోట్లు అందుతాయి.ఇంత భారీ మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగడం గొప్ప విషయంబాన్సువాడ నియోజకవర్గంలో లక్ష రూపాయల వరకు ఉన్న 13,600 మంది రైతులకు పంట రుణాలు మాఫీ కానున్నాయని నాయకులు వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
