తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలకు పంట రుణాలను గురువారం సాయంత్రం నాటికి మాఫీ చేయనున్నట్లు తెలపడం పట్ల కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి కోటగిరి మండల రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వారి మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్ష రూపాయల లోపు వరకు మొదటి విడతలో రైతులకు రుణాలు మాఫీ కానున్నాయని, మిగతా రైతులందరికీ ఆగస్టు లోపు పంట రుణాలన్నీ ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఒక ప్రకటనలో కాంగ్రెస్ నాయకులు తెలిపారు.సిఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త వినిపించారు.లక్ష రూపాయిలు లోపు రుణం తీసుకున్న రైతుల రుణాలను ఈ నెల 18వ తేదిన మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజున మొత్తం రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. అదే రోజు సాయంత్రం లక్ష లోపు రుణాలు పొందిన రైతుల బ్యాంక్ ఖాతాలలో నిధుల జమ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
కోటగిరి మండలం లో కోటగిరి అంబేద్కర్ విగ్రహం దగ్గర గురువారం రోజున ఉదయం 10:30 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరుగుతుంది.
ఉమ్మడి కోటగిరి మండల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిడియా ప్రతినిధులు పాల్గొనాల్సిందిగా ఒక ప్రకటనలో కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
రేపు లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ
RELATED ARTICLES
