ద్రోణ జుక్కల్
రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులతో కలిసి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కి రైతులు,గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాన్ని రైతులు అందరూ కలిసి వీక్షించేందుకు రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ అనుసంధానాన్ని ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఏక కాలంలో 2 లక్షలు రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించదగ్గ అంశమని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందని అన్నారు.రాహుల్ గాంధీ వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని.
అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రైతులందరూ బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రైతు రుణాలు మాఫీ చేస్తుందని భరోసా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రజా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని అన్నారు.గురువారం సాయంత్రం వరకు లక్ష లోపు రుణాలున్న 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేయబోతుందని,
ఆగష్టు 15 లోగా రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తుందని చెప్పారు.ఇది రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సగర్వంగా సంబురం చేసుకోవాల్సిన సందర్భం అని అన్నారు.
రైతన్నల రుణమాఫీ సంబురాలతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం సంతరించుకున్నదని, అన్నదాతలు ఆనందోత్సాహాలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
