సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
ద్రోణ జుక్కల్
జుక్కల్ నియోజకవర్గంలో పాటు జుక్కల్ మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. ఎస్డిఎఫ్ నిధులతో సెంట్రల్ లైటింగ్ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనుకబాటు గురైందని గతంలోని పాలకులు నిర్లక్ష్యమే కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అన్నిటిని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం దేయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే లక్ష రూపాయల లోపు అప్పులున్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి రైతుల ఎకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. వచ్చే నెలలోపు 2 లక్షల లోపు రైతులందరి రుణాలు మాఫీ చేసి తీరుతామన్నారు. అభివృద్ధి సంక్షేమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ముందంజలో నడిపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మండల కేంద్రంలోని ప్రైవేటు వ్యాపారి ఏర్పాటు చేసిన దుకాణాన్ని ప్రారంభించారు.
