ద్రోణ బోధన్
బోధన్ సీనియర్ సివిల్ జడ్జి,జూనియర్ సివిల్ జడ్జి కోర్టులలో ప్రభుత్వం తరపున కేసులు వాధించడం కోసం సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా బోధన్ రాకసిపేటకు చెందిన సీనియర్ న్యాయవాది బోగ్గుల రవీందర్ ను నియమిస్తు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు.పదవి బాధ్యతల్లో భాగంగా రవీందర్ బోధన్ లో గల సీనియర్,జూనియర్ సివిల్ జడ్జి ల కోర్ట్ లో ప్రభుత్వం తరపున కేసులను వాదించవలసి ఉంటుంది.ప్రభుత్వం న్యాయవాదిగా నియామకం పొందిన రవీందర్ 1992 నుండి న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నరు.సమాజ సేవలో భాగంగా ఆయన పలు సంవత్సరాలగా రాజకీయ పార్టీల లో చురుకుగా వ్యవహరించారు. బోధన్ పట్టణ మున్నూరు కాపు సంఘము కోశాధికారిగా వ్యవహరించడం తో పాటు రాకాసిపేట తర్ప మున్నూరు కాపు సంఘము ముఖ్య నాయకులుగా గుర్తింపు పొందారు. రవీందర్ సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చెప్పట్టడం పట్ల బోధన్ బార్ అసోసియేషన్ కి చెందిన సీనియర్,జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తనను ప్రభుత్వ న్యాయవాదిగా నిమించటానికి సహకరించిన బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కి,స్థానిక నాయకులు శ్రేయోభిలాషూలకు,మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తన పదవి బాధ్యతలను సమర్ధవంతంగా,సక్రమంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
