Tuesday, February 17, 2026

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

ద్రోణ జుక్కల్

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మద్నూర్ మండల కేంద్రంలో రైతులు, రైతు నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి రుణమాఫీ సంబురాల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైక్ ర్యాలీలు, టపాకాయలు డప్పుల మోతలతో మద్నూర్ మండల కేంద్రంలో అంబరాన్నంటిన రుణమాఫీ సంబురాలురైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తూ నిజమైన రైతు బాంధవుడు అని నిరూపించుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు.
ఇది రైతు ప్రభుత్వమని రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడి రైతులను రాజులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక భారమైనప్పటికీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నదని చెప్పారు.
రుణమాఫీ అసాధ్యమని హేళన చేసిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇది చెంపపెట్టు అని అన్నారు.
రైతుల పట్ల ప్రేమ, చేయాలనే సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హర్షం వ్యక్తం చేశారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిట్లం మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ పనులు మొదలుపెట్టామని, శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో ప్రారంభించామని , త్వరలో మద్నూర్ లో కూడా రోడ్డు మరియు సెంటర్ లైటింగ్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.అదేవిధంగా మద్నూర్ మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ సమస్య గురించి తన దృష్టికి వచ్చిందని త్వరలోనే వాటి పనులు కూడా ప్రారంభమవుతాయని
హామీ ఇచ్చారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటిదాకా మనం చేసిన పనులు, భవిష్యత్ లో చేయబోయే పనుల గురించి ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ప్రణాళికలతో పని చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular