Tuesday, February 17, 2026

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

వర్ధన్నపేట ఎమ్మెల్యే

ద్రోణ వర్ధన్నపేట

రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.శనివారం రోజున హాసన్పర్తి ఎంపీడీవో ఆఫీస్ పక్కన ఉన్న ట్రైనింగ్ సెంటర్లో లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు లబ్ధిదారులకు అందచేసారు.
హనుమకొండ కాజీపేట హసన్పర్తి మరియు 55,56,65,66డివిజన్ల పరిధిలో అనారోగ్యానికి గురైన వివిధ గ్రామాలకు చెందిన 80 మంది బాధితులకు మంజురైన 28 లక్షల రూపాయల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందచేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు మాట్లాడుతు ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు, పేదలను ఆదుకోవడం కోసం సిఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రములో ప్రజాకర్షక పథకాలను రూపకల్పన చేసిన సిఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు గారికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకటరామ్ నరసింహారెడ్డి, మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘు చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, అజయ్, శ్రీనివాస్ రెడ్డి మరియు డివిజన్ల అధ్యక్షులు కొంక హరిబాబు, కనపర్తి కిరణ్, అయ్యాల రాంరెడ్డి, తోపాటు సీనియర్ నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, పోలేపాక అశోక్, మాజీ సర్పంచ్ విజయ్, మండల గ్రామస్థాయిల నాయకులు వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, డివిజన్ల సీనియర్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular