జోరువానలో బైక్ పై కూర్చున్న ఆమె వెట్రి వెల్వి ( IAS ).పది రోజుల క్రితమే ఏలూరు జిల్లా కు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వెట్రీ సెల్వి. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. జిల్లా నాయకులు ఇళ్లను దాటి బయటకు రాలేదు.వెట్రి వెల్వి మాత్రం వర్షం కారణంగా ప్రజలు పడుతున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే సంకల్పంతో శుక్రవారం వేలేరుపాడు వచ్చారు. కారు వెళ్ళలేని ప్రాంతానికి మోటార్ సైకిల్ పై వెళ్లి వరద పరిస్థితిని సమీక్షించి తీసుకోవలసిన చర్యలు గురించి ఆదేశాలు జారీ చేసారు.అలాగే గురువారం వేలేరుపాడు ప్రాంతంలోనే వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావటానికి హెలికాప్టర్ ను సైతం సిద్ధం చేసారు కలెక్టర్ వెట్రి సెల్వి.
