Friday, May 15, 2026

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి కరెంట్ షాక్

ద్రోణ కామారెడ్డి జిల్లా:జులై 20

కామారెడ్డి‌లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో వర్షపు నీరు చేరడంతో గోడలకు, స్విచ్ బోర్డులకు కరెంట్ షాక్ తగులుతుంది. గొడలకు షాక్ వస్తుండటం తో రోగులు, వారి బంధు వులు ఆందోళన వ్యక్తం చేస్త్తున్నారు. గోడలను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురవుతున్నామని అంటున్నారు.
నిన్న రాత్రి ఫ్యామిలీ ప్లానిం గ్ వార్డులో ఒక్కసారిగా కరెంటు షాక్‌ రావడంతో పేషెంట్లు,వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
ఆపరేషన్ థియేటర్‌‌లో కరెంట్ షాక్ వస్తుండటంతో సర్జరీలు నిలిపివేసినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular