ద్రోణ కామారెడ్డి ప్రతినిధి
పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ప్రజా వ్యతిరేకతను చవిచూసిన టిఆర్ఎస్ నాయకులు ప్రగల్బాలు పలకడంపై ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని రుణమాఫీ పేరిట రైతుల ఆర్థిక స్థోమతను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచే ప్రయత్నం చేస్తుంటే రైతుల అభివృద్ధిని ఓర్చుకోలేక విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఇచ్చినమాటకు కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రూ. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు.
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలే కేంద్రబిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇంత అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నా, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు గొప్ప పరిపాలన చేసి ఉంటే 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రాంగా ఎలా మారిందని ప్రశ్నించారు.అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రాజెక్ట్ ల పేరుతో ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు దోసి పెట్టారని ద్వజమెత్తారు.విద్యా, వైద్య రంగాన్ని అద్వాన్నంగా తయారు చేశారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎక్కువ సమయం కేటాయించాలని, వారి పట్లమర్యాదగా నడుచుకోవాలని అధికారులకు హితవు పలికారు. ప్రజా పిర్యాదులను పెండింగ్ లో పెట్టరాదని, వారం పది రోజుల్లో వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ గాంధీ కుటుంబం ప్రాణాలైనా అర్పిస్తుంది కానీ మాట మాత్రం తప్పదు. నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేద రైతుల పక్షాన నిలబడి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు.ఇందిరా గాంధీ బ్యాంకులు జాతీయం చేసి దున్నే వాడికి భూమి పేద ప్రజలకు ఇల్లు కట్టించి పంచి నారు.
రాజీవ్ గాంధీ భారతదేశానికి సాంకేతిక టెక్నాలజీ అందించారు. యూనివర్సిటీలో కాలేజీలు కట్టారు.
సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ హయాంలో దేశ రైతుల రుణమాఫీ ఒకేసారి చేశారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ మాట ఇచ్చారు ఈరోజు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారు. రుణమాఫీ పై రైతుల సందేహాల నివృత్తికి కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు.
మండల కేంద్రాల్లోనూ సహాయ కేంద్రాలు ఏర్పాటు. చేస్తాం.
రైతు వేదికల్లో అందుబాటులో రైతు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా ఉంచుతాం.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం
కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన లో ప్యాకేజీల పెండింగ్ పనులను పూర్తి చేసేలా ముఖ్యమంత్రి ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకెల్లము త్వరలో పనులు ప్రారంభిస్తాం. రైతుల రుణమాఫీ ఓ విప్లవాత్మకమైన మార్పు అని, చరిత్రలో నిలుస్తుందని పేర్కొన్నారు. రుణమాఫీ అమలు ద్వారా సోనియా, రాహుల్ ఇచ్చిన హామీ నెరవేర్చామని చెప్పారు.
పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు మాఫీ చేసింది రూ.25వేల కోట్లు మాత్రమేనని.కాంగ్రెస్ సర్కారు 8నెలల్లోనే రూ.31వేల కోట్లు మాఫీ చేసిందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద తప్పిదమని, దీన్ని సాగునీటి కోసం కాకుండా కమీషన్ల కోసమే నిర్మించి ప్రజా ధనాన్ని వృథా చేశారనిఅన్నారు.
ఫలితంగా రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ సింధు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
