Tuesday, February 17, 2026

నేడే సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల

ద్రోణ హైదరాబాద్ :జులై 21

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సంబురం మొదలైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్త జనం పోటెత్తుతు న్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారి చల్లని దీవెనల కోసం భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలుస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. వంద సీసీ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు. వీఐపీ దర్శనాల సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular