ద్రోణ కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్, స్నేహపురి కాలనీలో ఆదివారం అమ్మవారి బోనం ఎత్తుకొని అంగరంగ వైభవంగా కాలనీలోని మహిళలందరూ అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఇట్టి ఉత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ.వాళ్లతో పాటు బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని రైతన్నలు సుఖసంతోషాలతో పాడిపంటలు పండించుకొనే విధంగా ఉండాలని ప్రజలంతా సుఖశాంతులతో, అనారోగ్య బాధలు లేకుండా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా బోనాల ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్, పాతశివ కృష్ణమూర్తి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
