Tuesday, February 17, 2026

అమెరికాలో ఏపీ వెటర్నరీ వైద్యురాలి మృతి

ద్రోణ అమరావతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతి. కుటుంబ సభ్యుల రోదన మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు. మంత్రి లోకేష్ స్పందించాలని విన్నపం, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక 25 సంవత్సరాల వెటర్నరీ డాక్టర్ అమెరికాలోని ఒకలా హోమా స్టేట్(UC0 ) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు హారిక తల్లిదండ్రులు దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు నాగమణిల కుమార్తె హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు ముఖ్యంగా మంత్రివ నారా లోకేష్ చొరవ తీసుకొని హారిక మృతదేహాన్ని తెనాలికి వచ్చేందుకు సహకరించాలని విన్నవించుకుంటున్నారు. హారిక మరణ వార్త విని శ్రీనివాసరావు నాగమణిల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular