Monday, February 16, 2026

పేద విద్యార్థి కి కడియం కుటుంబ ఆపన్నహస్తం

ద్రోణ హనుమకొండ

పేద విద్యార్థి ఉన్నత చదువులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య , మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి అండగా నిలిచారు. వేలేరు మండలం, మల్లికుదుర్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వీరారెడ్డి కుమారుడు మనిర్వేశ్ రెడ్డి ఎంసెట్ లో ర్యాంక్ సాధించి, కిట్స్ వరంగల్ సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సాధించారు. కాలేజీ ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో విషయం తెలుసుకున్న ఎంపీ డా. కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి , విద్యార్ధి ఉన్నత చదువులను ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో కడియం ఫౌండేషన్ ద్వారా మనిర్వేశ్ రెడ్డి చదువులకు ఆర్ధికంగా అండగా నిలిచిన ఎంపీ డా. కడియం కావ్య మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉన్నతమైన చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని వారు విద్యార్ధికి సూచించారు. మంచి పేరు తెచ్చుకోవాలని, ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాలేజీ ఫీజుకు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎంపీ డా. కడియం కావ్య కి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి మనిర్వేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోదేలా రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular