Tuesday, February 17, 2026

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బోథ్ ఎస్సై రాము

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని బోథ్ ఎస్సై రాము ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బోథ్ మండల ప్రజలు, లోతట్టు గ్రామాల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాగులు, కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్ళకూడదు. వర్షంలో వాహనాలను నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మండలంలో లోలేవల్ వంతెన వల్ల నక్కలవాడతో పాటు పలు ప్రాంతాల ప్రజలకు వరద ప్రవాహం పై అవగాహన కల్పించామని ఎస్సై రాము ఆదివారం తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ప్రజలకు సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular