ద్రోణ కోటగిరి
నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థుల మధ్య భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను చేపట్టారు. విద్యార్థులకు పండ్లు, చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. పోచారం కుటుంబ సభ్యులు బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని భవిష్యత్తులో భాస్కర్ రెడ్డి రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని తాజా మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చాగం కృష్ణారెడ్డి, కోటగిరి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు హమీద్,దత్తత్రి రావు, వెంకట్, లక్ష్మణ్, గంగారాం, నాగిరెడ్డి శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.
