ద్రోణ ప్రతినిధి హైదరాబాద్ :–
నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పాదయాత్రగా అసెంబ్లీకి బయలుదేరిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీ.

ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.రూ.2 లక్షల రుణమాఫీ బేషరతుగా జరగాలని అన్నారు. ఫసల్ బీమా యోజనను అమలు చేయడం లేదని, పంట నష్టపరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు.అలాగే వరికి రూ.500 బోనస్ మరియు రైతు భరోసా ప్రతి యజమాని రైతుకు రూ.15 వేలు, రైతు కూలీకి రూ.12 వేలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బడ్జెట్ సమావేశాల మొదటిరోజు సందర్భంగా నిర్వహించిన ఈ పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా.పాల్వాయి హరీష్ బాబు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్, రాకేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ప్రవేశించారు.రైతాంగ సమస్యల మీద అసెంబ్లీలో చర్చకు పట్టుపడతామని హామీ ఇచ్చారు.
