Tuesday, February 17, 2026

తెలంగాణ ప్రజలను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్

ద్రోణ నిజామాబాద్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో ఏ మాత్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్రం పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్న సౌతి తల్లి ప్రేమను తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తగినన్ని నిధులను కేటాయించకుండా బోధన్ బీదర్ రైల్వే లైన్ ఏర్పాట్లు ఒక్క అడుగు ముందుకు వేయకుండా నిధులను కేటాయించకపోవడంతో పాటు మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో జక్రాన్ పల్లి లో ఏర్పాటు చేస్తామన్న విమానాశ్రయానికి నిధులను కేటాయించకుండా జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశారని అన్నారు.

ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు ఏమాత్రం సంతృప్తి పరచలేదని ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన బిజెపి ఎంపీలు ఈ బడ్జెట్ పట్ల నోరు మెదపకపోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular