Tuesday, February 17, 2026

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని లోటు

నిజామాబాద్ ద్రోణ ప్రతినిధి:-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తెలంగాణాకు తీరని అన్యాయం చేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ దేశమొత్తం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, పక్షపాత ధోరణితో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల విబేధాలు పెంచేవిధంగా బడ్జెట్‌ కేటాయింపులు చేయడం అన్యాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అమలు పర్చాల్సిన విభజన హామీలు ఒక్కదాన్ని కూడా పూర్తి చేయకపోవడం నరేంద్రమోడీ పార్శ్య దృష్టికి నిదర్శనం.విభజన హామీల ప్రకారంగా తెలంగాణకు బయ్యారం స్టీల్‌ ప్యాక్టరీ, కాజీపేట కోచ్‌ప్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, గిరిజన విశ్వవిద్యాలయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు గతంలో నిధులు ఇవ్వకపోడం మరి ఇప్పుడు కూడా పాలమూరు ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదని అన్నారు. నిధులు ఇవ్వకుండా తెలంగాణ గుండెకాయ అయిన సింగరేణి గనులను కార్పోరేట్‌ పరం చేస్తున్నారని మండిపడ్డారు. గత పర్యాయం ఇరు తెలుగు రాష్ట్రాల పట్ల పక్షపాత వైఖరి అవలంబించిన మోడి, ఇప్పుడు మిత్రపక్షాలను నిలబెట్టుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి నుండి 8 మంది ఎం.పి.లు గెలిచారని, వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా తెలంగాణ ప్రజలను తీరని అన్యాయం చేశారని తెలిపారు. ఓట్ల మీద ఉన్న ప్రేమ బాధ్యతల పట్ల లేదని, తెలంగాణ నుంచి గెలిచిన బిజెపి ఎం.పి.లు బాధ్యత వహించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ గా డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular