ఆగస్టు నాలుగు, ఐదు తేదీలలో సిపిఐ నిర్వహిస్తుంది
నేడు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నిజామాబాద్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి సుధాకర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల రాజకీయ శిక్షణ తరగతులు రెండు రోజులపాటు నిజామాబాద్ నగరంలో జరుగుతున్నాయి ఈ శిక్షణ తరగతులు మొదటి రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పశ్వ పద్మ, ఇతర నాయకులు హాజరవుతున్నారు. సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇతర అంశాలపై శిక్షణా తరగతులు కలవని ఈ శిక్షణను విజయవంతం కై రెండు జిల్లాల సిపిఐ జిల్లా కౌన్సిలర్ సభ్యులు మరియు ప్రజా సంఘల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరు కావలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వై. భూమయ్య, కె. రాజన్న రంజిత్ నర్సింగ్ రావు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
