తెలుగుదేశం పార్టీ డిమాండ్
ద్రోణ బోధన్ జూలై 24
వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి దేవాదాయ శాఖ ఉన్నత ఉద్యోగి శాంతి తో అక్రమ సంబంధం కలిగి ఉండి ఒక మగ బిడ్డకు జన్మకు కారణమైనట్లు గా ఆరోపణలు ఎదుర్కొన్న విజయ సాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,న్యాయవాది సీ.హెచ్. వి. హన్మంతరావు డిమాండ్ చేశారు.విజయ్ సాయిరెడ్డి విశాఖపట్నంలోని పలు ప్రభుత్వ,ప్రైవేటు, వ్యక్తులకు చెందినా విలువైన భూములను అక్రమించినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నా విషయాన్ని ఆయన గుర్తుచేశారు.శాంతి భర్త మదన్ మోహన్ విజయ్ సాయిరెడ్డి పై స్పష్టమైన ఆరోపణలతో ఉన్నత అధికారులతో పిర్యాదు చేసినందున విజయ్ సాయిరెడ్డి డిఎన్ఏ పరీక్ష కు స్వచ్ఛందము గా ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.రాజకీయ ఉన్నత పదవులను అడ్డంగా పెట్టుకొని విలువైన భూములను కొల్లగొట్టడంతో పాటు అనైతిక చర్యలకు పాటుపడ్డ విజయ్ సాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రజాస్వామిక వాధులందరు కోరుతున్నారని అన్నారు. విజయ సాయిరెడ్డి అక్రమాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం విజయ సాయిరెడ్డి అక్రమ చర్యలను కూలంకషంగా పరిశీలించడం తో పాటి ఆయనకు సహకరించిన అధికారుల పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి మదన్ మోహన్ దంపతులకు పాటు వారి కుటుంబ సభ్యులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు.
