విద్యార్థినికి సహాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి
సిరిసిల్ల జిల్లా:జులై 24
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత JEE మెయిన్ లో,ST, 824వ ర్యాంకు సాధించారు.
పాట్నా IITలో సీటు వచ్చి నా.. చేరేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల్ని మేపుకొంటున్నారు.
మధులత ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్, ఆమెకు రూ. 1.5 లక్షల సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
డబ్బులేని ప్రతిభావంతులైన పిల్లలకు ఇలాంటి సాయాన్ని కొనసాగించాలని సీఎంను పలువురు కోరుతున్నారు.
