Tuesday, February 17, 2026

కేంద్ర బడ్జెట్ పై నిరసన తెలిపిన రైతు కూలి సంఘం

ద్రోణ బోధన్ జూలై 24

బోధన్ ఆర్డిఓ కార్యాలయం వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేసి ధర్నా చేశారు. డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు యేశాల గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము మంగళవారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల కోసం కాకుండా దేశంలో ఉన్నటువంటి పెట్టుబడుదారుల వ్యాపారులకి పూర్తిస్థాయిలో కేటాయించటం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి మరియు ఇతర రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించడంలో పూర్తి వైఫల్యం చెందింది తనకు మద్దతు ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీహార్ రాష్ట్రానికి ఎక్కువ నిధుల కేటాయిస్తూ తన రాజకీయ నీతిని చెప్పకనే చెప్పినట్టుగా ప్రదర్శించింది. ఇది సరైన పద్ధతి కాదు దేశంలో గ్రామీణ ఉపాధి హామీ కొరకు మేధావులు ఇతరులు కూడా సుమారుగా రెండు లక్షల 40 కోట్లు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి సూచన చేస్తే కేంద్ర ప్రభుత్వం 86 లక్షల కోట్లు వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 600 ఇవ్వాలి సంవత్సరానికి 200 దినాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు.గ్రామీణ ప్రాంతం తో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీని విస్తరించాలి.ఆహార పదార్థాల ధరలు మూడు పాయింట్ ఐదు శాతం నుండి 7.5% పెరిగాయి. వాటిని నియంత్రించాలి. తెల్ల రేషన్ కార్డుదారులకు ఆహార పదార్థాల సబ్సిడీ గత సంవత్సరం రెండు లక్షల 12 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం రెండు లక్షల ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు. దీని మూలంగా దేశవ్యాప్తంగా ఉన్న 85 లక్షల కోట్ల కుటుంబాలకు ఆకలితో ఉండే పరిస్థితులు కలిగే అవకాశం ఉంది.వీటితో పాటు అనేక విషయాలు కూడా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకు నష్టం కలిగించే పద్ధతిలో బడ్జెట్ ఉంది. వీటిని సవరించి అవకాశముంటే బడ్జెట్ను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తిరునగరి శశికళ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కార్యకర్తలు గైని రాములు షేక్ నజీర్ అడపా బోర్ర సాయిలు పల్లికొండ షింటు సాయినాథ్ నేహల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular