నాయకత్వంలో ..సిఎం రేవంత్… డిప్యూటీ సిఎం భట్టి లది బెస్ట్ బడ్జెట్
రేవంత్…భట్టి లది అభివృద్ధి బడ్జెట్..కేసీఆర్ ది అప్పుల బడ్జెట్
వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ ది..
ఊహల బడ్జెట్ గత టిఆర్ఎస్
వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది
10 వేల కోట్లతో హైద్రాబాద్ దశ మార్చాలని రేవంత్ ఆలోచన
హామీల అమలు పై జనంలోకి రావడానికి మా మంత్రులు ఉత్తమ్..భట్టి..తుమ్మల..పొన్నం సిద్ధం.. కేటీఆర్ నువ్వు సిద్ధమా?
చీల్చుడు లో మేమే ఎక్స్పర్ట్.. కేసీఆర్ కాదు
మాదగ్గర రాజకీయాలు నేర్చుకున్న కేసీఆర్ కి ఛీల్చుడు ఏం తెలుసు
జగ్గారెడ్డి
ద్రోణ హైదరాబాద్ జులై 25
రేవంత్… భట్టి లు పెట్టింది మంచి బడ్జెట్ ఇది.
కేసీఆర్ ఇస్ట్మాన్ కలర్ బడ్జెట్ అన్నారు.
కేసీఆర్ ది హైప్ బడ్జెట్.. కాంగ్రెస్ బడ్జెట్ ప్రాక్టికల్
కేసీఆర్ బడ్జెట్..ఊహల బడ్జెట్
కాంగ్రెస్ ది వాస్తవ బడ్జెట్
ఊహలకు… వాస్తవానికి తేడా ఉంది.భట్టి బడ్జెట్ బిందల్లో నీళ్లు ముంచుకుని తాగినట్టు ఉంది.
కేసీఆర్ బడ్జెట్ చెరువులో నీళ్ళు తెచ్చుకుని తాగినట్టుగా
మాటకు కట్టుబడి…వాస్తవానికి దగ్గరలో కాంగ్రెస్..కాంగ్రెస్ బడ్జెట్ ఉంటుంది.
ఎవరైనా దావతి ఇస్తే…నాన్ వెజ్ కి ప్రయార్టి ఇస్తాం.
కేసీఆర్ బడ్జెట్ ఎట్లా ఉంటది అంటే దావతికి పోతే మటన్ బిర్యాని తిని రావచ్చు అన్నట్టు ఉంటది .ఊరందరికీ మటన్ బిర్యానీ వందుతున్న అని ప్రచారం చేస్తారు.పొయ్యి.. పొయ్యి మీద గిన్నె లు పెడతారు కానీ మటన్ ఉండదు.మటన్ ఎప్పుడు వస్తుందో అని మనం ఎదురు చూస్తాం… అక్కడ మటన్ లేదు.. ఏం లేదు
ప్రజలను బడ్జెట్ విషయంలో కేసీఆర్ కూడా అట్లనే మోసం చేశారు.
కాంగ్రెస్ ది… పప్పు.. మజ్జిగ.. ఉంది… ఇది ఉంది తృప్తిగా తినండి అని నిజం చెప్పినట్టు ఉంటది.
మంచి బడ్జెట్ పెట్టిన సిఎం రేవంత్… డిప్యూటీ సిఎం భట్టి…శ్రీధర్ బాబుకి శుభాకాంక్షలు.
ఆరు గ్యారెంటీ లకు సరిపడ నిధులు కేటాయించారు.
వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది.
హైదరాబాద్ కి 10 వేల కోట్లు మంచి నిర్ణయం
తెలంగాణ కి గుండెకాయ లాంటిది హైదరాబాద్
10 వేల కోట్లు తో హైదరాబాద్ అభివృద్ధి చేసి పారిశ్రామిక వేత్తలు విరివిగా రావచ్చు.
రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. కార్మికులు… పరిశ్రమలు అభివృద్ధి జరుగుతుంది.
హైదరాబాద్ కి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది.
దేశంలో వ్యాపారస్తులు హైదరాబాద్ కి ప్రాధాన్యత ఇస్తారు.*
బి ఆర్ ఎస్ ఇలా చేయలేదు హైదరాబాద్ కి మీరు నిధులు పెట్టలేదు. మేము పెడుతున్నాం.
మేము హైదరాబాద్ కి 10 వేల కోట్లు పెడితే కేసీఆర్ కుళ్లుకుంటున్నారు.
ఎందుకు అంత కుళ్ళు
కాంగ్రెస్ వేసిన ఫ్లైఓవర్ లకు కేటీఆర్ రిబ్బన్ కట్ చేశారు.
కేసీఆర్ ది అప్పులకు ప్రాధాన్యత… అభివృద్ధి ఆలోచన రేవంత్ భట్టిది.
అప్పుల చరిత్ర బి ఆర్ ఎస్ ది…అభివృద్ధి చరిత్ర కాంగ్రెస్ ది
కేటీఆర్..ప్రతిపక్ష నాయకుడు కాబట్టి..ఆరోపణలు చేస్తున్నారు
కేటీఆర్..పొన్నం ఇద్దరు ఆర్టీసీ బస్సులో ఎక్కండి. ఉచితంగా బస్సు లో మహిళలు వెళ్తున్నారా లేదా అని తెలుస్తుంది.
తుమ్మలతో కలిసి రైతుల దగ్గరికి పొండి… రుణాలు మాఫీ ఐతున్నాయా లేదో తెలుసు కొండి.
నువ్వు బి ఆర్ ఎస్ కార్యాలయంలో కూర్చొని మేము గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడటం ఎందుకు.
భట్టితో కలిసి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుందో లేదో చూడండి.
ఉత్తమ్ నీ తీసుకుని 500 సిలిండర్ ఇస్తున్నారో లేదో అడగండి.
చీల్చుడు లో మేము ఎక్స్పర్ట్ కేసీఆర్ కాదు
కేసీఆర్ రాజకీయం మా దగ్గర నేర్చుకున్నోడివే.నీ కంటే ఎక్కువ డైలాగ్ కొట్టే వాళ్ళు మా దగ్గర వంద మంది ఉన్నారు.
