భవన నిర్మాణదారులకు ఎస్‌ఐ ఫోన్..

రూ.10 వేలు చెల్లించాలని ఒత్తిడి?
హైదరాబాద్, నవంబర్ 12( ద్రోణ):- పోచారం పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్ ఐ నాగేశ్వరరావు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో భవన నిర్మాణదారులకు ఫోన్ చేసి నగదు చెల్లించాలని కోరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక్కో భవన నిర్మాణదారుడు రూ.10 వేల చొప్పున చెల్లించాలని ముందుగానే నిర్ణయించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నట్లు వినిపిస్తోంది. అంతేకాకుండా అదే రోజు అడ్వాన్స్ చెల్లించాలని, వారం రోజుల గడువు కోరడం సరికాదంటూ డబ్బులు పంపాలని సూచించినట్లు వీడియోలో ఉంది.
కమ్యూనిటీ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమే అయినప్పటికీ, వాటి పేరుతో పోలీసు అధికారి నేరుగా డబ్బులు అడగడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికులందరి సమ్మతితో నిర్ణయం తీసుకున్నప్పటికీ, విరాళాల సేకరణకు అనుసరిస్తున్న విధానం ఏమిటన్నది చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.