ఏడుగురిని పొట్టనబెట్టుకున్న కిరాతకుడు..

భార్యతో పాటు ఆరుగురు బంధువుల హత్య!

అక్రమ సంబంధం అనుమానంతో ఘాతుకం..

మృతదేహాలను గోనె సంచుల్లో కుక్కి దూర ప్రాంతాలలోపడేసిన నిందితుడు

బెంగళూరు, ప్రతి నిధి నవంబర్ 11(ద్రోణ):- కట్టుకున్న భార్య పై అనుమానం పెంచుకున్న ఓ క్యాబ్‌ డ్రైవర్‌ దారుణానికి ఒడిగట్టాడు. భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత మార్చిన ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. రాజాజీ నగర్‌ పరిధిలోని భాష్యం సర్కిల్‌ ప్రాంతంలో అక్టోబర్‌ 16 నుంచి 31వ తేదీ మధ్య ఈ హత్యలు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
అర్జున్‌ ఇందుశేఖర్‌ (52) అనే క్యాబ్‌ డ్రైవర్‌ తొలుత తన భార్య సునీత (40)ను హత్య చేశాడు. ఆమె ఆచూకీ కోసం ఇంటికి వచ్చిన అత్త రూపవతి (65)ను కూడా చంపినట్లు తెలుస్తోంది. అనంతరం భార్య, అత్త ఇద్దరూ పర్యటనకు వెళ్లారని నమ్మబలికి.. భార్య సోదరులు శివకుమార్‌ (30), శంకర్‌ (44), వారి భార్యలు దివ్య (30), నళిని (29)లను ఇంటికి ఆహ్వానించాడు. వారికి మద్యం తాగించి ఒక్కొక్కరినీ హత మార్చి నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ దారుణంలో శివకుమార్‌ కుమారుడు పునీత్‌ (7)ను కూడా వదలకుండా చంపినట్లు సమాచారం.

మృత దేహాలను గోనె సంచులలో కుక్కి..
హత్యల అనంతరం మృత దేహాలను గోనె సంచులలో కుక్కి కారులో తరలించి నంది హిల్స్‌తో పాటు ఇతర మారుమూల ప్రాంతాలలో పడేసి నట్లు నిందితుడు విచారణలో వెల్లడించి నట్లు తెలుస్తోంది. హత్యలు జరిగిన సమయంలో ఇంట్లో టీవీ శబ్దాన్ని ఎక్కువగా పెట్టి, రాయితో దాడి చేసి ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు బాధిత కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. శంకర్‌, నళినిల కుమారుడైన ఆ బాలుడిని మాత్రం నిందితుడు వదిలి పెట్టినట్లు తెలుస్తోంది.
మరో వైపు, నిందితుడి మైనర్‌ కుమార్తె కూడా హత్యల అనంతరం రక్తపు మరకలను శుభ్రం చేయడంలో సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, ఆమె తనను బెదిరించేదని భావించి ఈ హత్యలకు పాల్పడి నట్లు అర్జున్‌ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని బలిగొన్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular