కజకిస్థాన్ వేదికపై హైదరాబాద్ కీర్తిపతాకం

బహదూర్‌పురా ఎమ్మెల్యే ముబీన్ ఘన సత్కారం

హైదరాబాద్, ప్రతి నిధి నవంబర్ 11(ద్రోణ):- అంతర్జాతీయ క్రీడా వేదిక పై హైదరాబాద్‌ కు చెందిన యువ బాడీబిల్డర్ ఇమ్రాన్ ఖాన్ తన ప్రతిభను చాటుకున్నారు. కజకిస్థాన్‌లో ఈ నెల 7న నిర్వహించిన ఐఎఫ్‌బీబీ ప్రో, ఎన్‌పీసీ వరల్డ్‌ వైడ్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్న ఆయన స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి గౌరవం తీసుకొచ్చారు.
హైదరాబాద్‌లోని బహదూర్‌పురాకు చెందిన ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించి స్వదేశానికి తిరిగి రావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇమ్రాన్ ఖాన్‌ను ఘనంగా సత్కరించారు. పూల మాలలు వేసి అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ పోటీలలో స్వర్ణ పతకం సాధించడం హైదరాబాద్‌తో పాటు దేశానికే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ సాధించిన విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular