రూ.15 లక్షల టీ బిల్లు..

ఎన్నికల సమావేశాల పేరిట అధికారుల ఖర్చుల బాగోతం

మూడేళ్లుగా పెండింగ్‌లో క్యాంటీన్ బకాయిలు

బిల్లులు చెల్లించక చిన్న వ్యాపారి ఉపాధికి గండి

హైదరాబాద్, ప్రతినిధి నవంబర్ 11(ద్రోణ):- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో అధికారుల టీ ఖర్చుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల సమావేశాల పేరుతో అధికారులు వినియోగించిన “టీ”కి సంబంధించిన బిల్లు ఏకంగా రూ.15 లక్షలకు చేరినట్లు సమాచారం. అయితే, ఈ భారీ మొత్తానికి సంబంధించిన బకాయిలు సకాలంలో చెల్లించక పోవడంతో క్యాంటీన్ నిర్వహిస్తున్న చిన్న వ్యాపారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
గత మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటం తో క్యాంటీన్ నిర్వాహకుడి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నట్లు సమాచారం. నిధుల కొరత కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాంటీన్ ఐదు రోజుల పాటు మూత పడినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారుల అవసరాల కోసం సేవలు అందించిన చిరు వ్యాపారి, తనకు రావాల్సిన బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటం విమర్శలకు గురైంది.

మరో వైపు ఎల్‌నినో ప్రభావం, నీటి కొరత నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్న (జీహెచ్ఎంసీ) యంత్రాంగం, తన కార్యాలయంలో జరుగుతున్న ఖర్చుల విషయంలో మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తోందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో నిర్వహించే కార్యాలయాల్లో ఖర్చులకు జవాబుదారీతనం ఉండాలని, క్యాంటీన్ నిర్వాహకుడికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular