సాలూర పీహెచ్‌సీలో వైద్య సేవల విస్తరణకు కృషి

24 గంటల పాటు వైద్య సేవలు అందించేలా చర్యలు..

నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరుపై హామీ

సాలూర, నవంబర్ 12( ద్రోణ):- మండల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

అదేవిధంగా ఆసుపత్రికి నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వంతో చర్చించి, అవసరమైన నిధులు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందేలా ఆరోగ్య కేంద్రాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular