సాలూర మండలంలో కొత్తగా ఆసరా పింఛన్ల పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక భరోసా కల్పించడమే

ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి

సాలూర, నవంబర్ 12 (ద్రోణ) :-
మండలంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లను గురువారం లబ్ధిదారులకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను అమలు చేస్తోందని తెలిపారు.

పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక భరోసా లభిస్తుందని, వారి జీవన అవసరాలకు కొంతమేర ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సాలూర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular