సాలూర పీఏసీఎస్‌కు నూతన పాలకవర్గం..

చైర్మన్ అల్లె రమేష్‌తో సభ్యులకు ఘన సన్మానం

సాలూర, నవంబర్ 12: (ద్రోణ)
మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అల్లె రమేష్‌తో పాటు పాలకవర్గ సభ్యులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం మండలంలోని సర్పంచులు, మాజీ పాలక వర్గ సభ్యులను కూడా సత్కరించి అభినందించారు. సహకార సంఘం అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన పాలక వర్గం కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతి నిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, సహకార సంఘం సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular