Tuesday, February 17, 2026

బోధన్ లో ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకలు

ఎంతోమంది ప్రాణత్యాగ ఫలమే కార్గిల్‌ యుద్ధ విజయం ఆర్డిఓ రాజేశ్వర్

భారతీయ సైనికుల పరాక్రమం ప్రేరణాదాయకం అని వారి త్యాగం నిత్యం స్మరణీయం బోధన్ ఏసీపీశ్రీనివాస్

ద్రోణ బోధన్, జూలై 26

ఎంతోమంది ప్రాణత్యాగ ఫలితమే కార్గిల్‌ యుద్ధ విజయమని బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్ అన్నారు.
శుక్రవారం బోధన్ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బోధన్ ఆర్ డిఓ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఎంతో మంది జవాన్లు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి కార్గిల్‌ యుద్ధ విజయాన్ని అందించారన్నారు. 1999లో పాకిస్తాన్‌ సైనికులు, ఉగ్రవాదులు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పాక్‌ చేసిన ప్రయత్నాన్ని ఆపరేషన్‌ విజయ్‌తో కార్గిల్‌ నుంచి పాక్‌ సైనికులను తరిమికొట్టారన్నారు. అప్పటి అమరులైన భారత జవాన్లను స్మరించుకుంటూ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ శుక్రవారం రజతోత్సవం జరుపుకున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీరులను స్మరించుకోవాలన్నారు. యువతలో చిన్నతనం నుంచి దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు.

భారతీయ సైనికుల పరాక్రమం ప్రేరణాదాయకం వారి త్యాగం నిత్యం స్మరణీయం అని బోధన్ ఏసిపి శ్రీనివాస్ అన్నారు.
భారతీయ సైనికుల పరాక్రమం ప్రేరణాదాయకం వారి త్యాగం నిత్యం స్మరణీయం అని
అన్నారు. దేశ సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ, తమ ప్రాణాలకు తెగించి శత్రువుల కుట్రలను తిప్పికొడుతూ, దేశ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న మన దేశ సైనికుల పోరాటం అసామాన్యం, అనితర సాధ్యం అన్నారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన అమర జవానులకు ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు
బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సురేష్ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రజతోత్సవ వేడుకలలో ప్రసంగించారు. అలాగే విధి నిర్వహణలో మృతి చెందిన గంగ ప్రసాద్ చిత్ర పటానికిపూల మాల వేసి నివాళులు అర్పించారు. అలాగే వారి తల్లిదండ్రులను సన్మానించారు.

బహుమతులు ప్రధానం

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రజతోత్సవ వేడుకలలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, దేశభక్తి గేయాల పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిలు చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.

ఎన్ సిసి క్యాడేట్లతో ర్యాలీ

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రజతోత్సవ వేడుకలు పురస్కరించుకొని బోధన్ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సురేష్, జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి ఎస్.కె.రసూల్ బి, సిడిపిఓ జానికి, మాజీ కెప్టెన్ వై.శ్రీనివాస్, ఎన్ సీసీ లెఫ్టినెంట్ లు డాక్టర్ వి.నర్సింహులు, నాగేశ్వరరావు, శైలు, అధ్యాపకులు, ఎన్ సీసీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular