Monday, February 16, 2026

హంకారాన్ని తగ్గించుకో కౌశిక్ కి సీతక్కవార్నింగ్

ద్రోణ హైదరాబాద్

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీలో సోమవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు బస్సులు పెంచాలంటూనే, మరో వైపు ఆటో వాలాలపై మొసలి కన్నీరు కారుస్తున్న కౌశిక్ రెడ్డి నీ దురంహకారం తగ్గించుకో, నీలా దర్మార్గమైన నాలెడ్జ్ నాకు లేదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలకు సేవ చేసే నాలెడ్జ్ మాత్రమే నాకుందంటూ మంత్రి వ్యాఖ్యానించారు. దూర ప్రాంతాల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు బాగానే నడుస్తున్నాయని, బస్సులు పెంచి ఆటో కార్మికుల పొట్ట కొట్టాలా? ఆటో వాళ్లను రెచ్చగొట్టే రాజకీయం వద్దంటూ హితవు పలికారు. మహిళలకు పథకాలు ఇవ్వద్దా? అంటూ పథకాలు ఇవ్వవద్దా చెప్పండంటూ ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం పట్ల విపక్షాల ఎమ్మెల్యే ధ్వంధ వైఖరిని ప్రదర్శిస్తున్నారని, అసలు ఉచిత బస్సు ప్రయాణంపై మీ వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular