Monday, February 16, 2026

క్రీడాకారిణి ప్రతిభకు ప్రోత్సాహకం అందించాలి

జుక్కల్ ఎమ్మెల్యే తోట శాసనసభలో విజ్ఞప్తి చేసిన వైనం

ద్రోణ జుక్కల్

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరీన్ మరియు క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ లకు ఇచ్చిన గుర్తింపు పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ప్రతిభ అనే క్రీడాకారిణి వివిధ క్రీడలలో రాణిస్తున్నదని తెలిపారు.ఈమధ్య కోల్ కతాలో జరిగిన ఇండియా & ఏషియన్ చెస్, బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఐదు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించిందని,
రెండు వరల్డ్ ఛాంపియన్ షిప్స్ కూడా సాధించిందని అన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క స్టేడియం గానీ కనీస క్రీడా సౌకర్యాలు లేకపోయినప్పటికీ ఆమె ఇంత అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుందని తెలిపారు.కాబట్టి ప్రభుత్వం తరపున ప్రతిభకు ప్రోత్సాహకం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular