ద్రోణ హైదరాబాద్
రాష్ట్ర సచివాలయంలో శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఎండి లతో మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని లాబాదాయకంగా చేయడంతో పాటు సంస్థ అభివృద్ధిలో కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు

ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సహకార కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ డైరెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు.
