Monday, February 16, 2026

వ్యవసాయ మంత్రి సమీక్ష లో కార్పొరేషన్ చైర్మన్ కాసుల

ద్రోణ హైదరాబాద్

రాష్ట్ర సచివాలయంలో శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఎండి లతో మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని లాబాదాయకంగా చేయడంతో పాటు సంస్థ అభివృద్ధిలో కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సహకార కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ డైరెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular