ఘన్ పూర్ మండలం, మైలారం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి నిర్మాణ పనులకు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు,కె ఆర్ నాగరాజు తో కలసి *వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన చేశారు.అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కావ్య అన్నారు. శనివారం మైలారం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. భూపాలపల్లిలో ఖనిజ సంపద, నీటి వనరులు, అడవులు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చితచిత్తుతో పనిచేస్తుందని పేర్కొన్నారు. భూపాలపల్లి హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ వేదికగా తన గళం వినిపిస్తానాని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తన పూర్తి సహకార అందిస్తానని ఎంపీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్థానిక ప్రజా పత్రినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
