ద్రోణ హైదరాబాద్
అనంతపురం జిల్లాలోని రామ్ నగర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏ టీ ఎం లో భారీ చోరీ జరిగింది. ఏ టీ ఎం ను గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఏ టీ ఎం లో అలారం సిస్టం పనిచేసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపు పరారయ్యారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
