Tuesday, August 18, 2026

పోలీస్ కమిషనర్ కు 31 ఫిర్యాదులు

నిజామాబాద్ ఆగస్టు 17 ద్రోణ

నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిర్వహించిన ప్రజావాణిలో 31 ఫిర్యాదులు ప్రజల నుండి స్వీకరించారు.
ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు సిపి చేశారు.ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుంద నీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular