బోధన్,ఆగస్టు 16 ద్రోణ
ఆపదలో ఉన్న బాల్య మిత్రుని కుటుంబానికి మీకు మేము అండగా ఉంటామంటూ చిన్ననాటి స్నేహితులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
సేవ చేయడానికి పేదరికం కులం మతం అడ్డు రావు అనే నిదర్శనానికి నిరూపిస్తూ బాల్య స్నేహితులు ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి ఈ మిత్ర బృందం సేవలందించడం ఎంతో అభినందనీయమని ప్రజలు కొని యాడుతున్నారు.
పోతంగల్ మండలం హంగర్గ ఫారం గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం దుర్కి X రోడ్ ప్రమాదంలో చనిపోయారు. బాధిత కుటుంబ పేద కాలనీ వారు పడే బాధలను గ్రహించి వారి చిన్ననాటి మిత్రులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. వారి మిత్ర బృందం సమాజానికి ఆదర్శప్రాయాలుగా నిలబడనున్నారు. బాధిత కుటుంబానికి4 పిల్లలు ఉన్నారు.వారి కుటుంబ పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన వారికి మేము తోడుగా అండగా నిలుస్తామంటూ అప్పట్లో పోతంగల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 2001/02 పదవ తరగతి విద్యాభ్యాసం కొనసాగించారు. ఆనాటి చిన్ననాటి స్నేహం కలకాలం కొనసాగాలన్న దృక్పథంతో 40,000 వేల రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సీతలే రమేష్, పబ్బ శేఖర్, B.సాయిలు, కిరణ్ ,సుధాకర్ రెడ్డి, సలీం,రషీద్, సజ్జత్, మహేష్ , లింగురం,సంతోష్, గంగాధర్, లు పాల్గొన్నారు.

