సమాచారం కోసం ఫోన్ అందజేసిన ఆలయ చైర్మన్ మమ్మల నేని రాజశేఖర్
బోధన్ ఆగస్టు 17 ద్రోణ
అడికేష్ లింగమయ్య ఆలయంలో సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని ఆలయ కమిటీ చైర్మన్ రాజశేఖర్ తన సొంత నిధులతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఎంతోమంది సమాజంలో కోట్లాది రూపాయలను సంపాదిస్తారు. కానీ కొంతమంది మాత్రమే సమాజ సేవ కోసం, దైవారాధన కోసం పాకులాడుతూ ఉంటారు. రాజశేఖర్ తాను నమ్మినదే దైవంగా భావించి అడిగేష్ లింగమయ్య ఆలయాన్ని అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మింప చేశారు. నిర్మాణ దశలో ఎన్నో ఏర్పడినప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు సహనంతో ముందుకు వెళ్లి కోట్లాది రూపాయలు వెచ్చించి ఆలయాన్ని చరిత్ర పుటల్లో నిలిపేటట్లు శ్రమించారు. నేడు ఆ కటోర శ్రమనే అడిగే లింగమయ్య ఆలయం పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాలుపంచుకుంటున్నారు. ఈ ఆలయంలో పూజలు చేసిన వారికి కోరుకున్న వరాలు లింగమయ్య భక్తులకు కొంగుబంగారంగా మారుతారు అన్న దృఢ నమ్మకం భక్తుల్లో ఉంది. అదే దృఢనమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజశేఖర్ లింగమయ్య ను నమ్ముకుని తాను కోరిన కోరికలన్నీ తీరాయని, ఆ దేవుని కృపను ఇలా తీర్చుకునే భాగ్యాన్ని కల్పించాలని రాజశేఖర్ తన ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దైవారాధన తో పాటు, ఎన్నో సమాజసేవలను చేస్తూ, ఎంతోమంది పేద విద్యార్థులకు తన సహాయ సహకారాలను అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర్ నిలిచిపోయారు. భవిష్యత్తులో భగవంతుని అనుగ్రహంతో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఆయన ఎదగాలని ఈ ప్రాంత భక్తజనం ప్రార్థిస్తున్నారు.
ఘనంగా శ్రావణ మాస పూజలు
శ్రావణ మాసం మొదటి సోమవారం ఆడికేష్ లింగమయ్య ఆలయం లొ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న ఆయన సైతం సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం అన్నదాన భక్తులకు ఘనంగా సన్మానించారు. ఆలయ బాగోగులు చూసుకుంటూ భక్తులకు తమ వంతు సేవలను అందిస్తున్న ఆలయ కార్య నిర్వహణ బాధ్యత నిర్వహిస్తున్న మాలి హనుమంతరావు పటేల్ను ఘనంగా సన్మానించి మరింత ఆలయ సేవలను భక్తులకు అందించాలనే ఉద్దేశంతో రాజశేఖర్ ఓ కొత్త ఫోను ఆయనకు అందజేశారు.
పుట్ట సత్తిబాబు సునీత అడ్కస్ పల్లి వాస్తవ్యులు భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మెన్ ముమ్మలనేని రాజశేఖర్ పద్మ శ్రీ వీణ చేతుల మీదుగా అన్నదాత కు సన్మాన గౌరవాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అందించిన ఫోన్ నెంబర్ సైతం భక్తులకు ప్రచారం చేయాలని సూచించారు.9063179568 అనే నంబర్ కు భక్తులందరూ సమాచారం తెలుసుకోవడంతో పాటు ఇతర సమాచారాన్ని ఆలయానికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చలసాని శ్రీకాంత్ తో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
