Monday, February 16, 2026

యువత భవిష్యత్తు కోసం నైపుణ్యాల అభివృద్ధి సంస్థ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ద్రోణ నల్లగొండ

చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను నల్లగొండ జిల్లా కేంద్రంలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ఆదివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ న్యాక్ ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ రకాల శిక్షణలను ఇవ్వడం జరుగుతున్నదని, ప్రత్యేకించి టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు వారి కాళ్ళ పై వారు నిలబడేలా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు కల్పించేందుకుగాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను నిర్మిస్తున్నామని,అది త్వరలోనే పూర్తవుతుందని తెల్పారు.
కుట్టుమిషన్ల ద్వారా శిక్షణ తీసుకున్న మహిళలు కష్టపడి పని చేస్తే రోజుకు 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చని, దీని ద్వారా స్వయం ఉపాధి కలుగుతుందని,అంతేకాక వారి కాళ్ళ పై వారు నిలబడవచ్చని అన్నారు. చదువుకున్న యువత ఖాళీగా ఉండకుండా, ఎదో ఒక రంగంలో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని, తద్వారా కుటుంబాలకు అండగా నిలబడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాక్ నల్లగొండ కేంద్రం ఇంచార్జి అశోక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ రవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular